Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : ఆపదలో ఉన్న వారికీ రక్తదానం చేస్తూ నేటితో పది సార్లు రక్తదానం చేసిన ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్&యాంటీ కరప్షన్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షులు వి.విజయ్ కుమార్ అందరికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. కర్నూలు నగరం,32వ వార్డ్,ముజఫర్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసు కుంటున్నాడు.అతనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.వ్యక్తికి రక్తం తక్కువ ఉండడం వల్ల రక్తం అవసరం అవుతుందని వైద్యులు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు.వి.విజయ్ కుమార్ కు సమాచారం తెలియచేశారు.దీంతో మానవతా దృక్పథంతో స్పందిం చి,శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు.అ నంతరం రక్తదానం చేసిన విజయ్ కుమార్ ను రోగి కు టుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచే శారు.ఈ సందర్బంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మనిషికి ఆపద కలిగినపుడు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరు స్వీకరించాలని కోరారు.ఎన్ని ఆస్తు లు,అంతస్తులు ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక రోజు రక్తం అవసరం అవుతుందన్నారు.అలాంటి సమయంలో ఇత రులపై నేటికీ ఆధారపడాల్సి వస్తుంది అన్నారు.రక్తదా నంపై అపోహలు విడాలని.రక్తం ఇవ్వడం వల్ల తమ శరీ రంలో కొత్త రోగాలు వస్తాయి అనే అపోహతో చాలా మంది ఇతరులకు రక్తం ఇవ్వడంలో ముందుకురాకపో వడం జరుగుతుందని.ఇది సరి కాదన్నారు.అందుకు ఆపద సమయంలో ఇతరులకు రక్తదానం చేయడం ద్వా రా కొత్త రక్తం సరఫరా అవుతుందని పేర్కొన్నారు.కొత్త రక్తం సరఫరా అవుతున్న శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.కావున ఇప్పటికైనా ఎక్కడిక క్కడ కుటుంబ సభ్యులు,స్నేహితులు తమ రక్తం యొక్క గ్రూప్ తెలుసుకోవాలి.ఆపద సమయంలో సాటిమనిషికి దైర్యంగా రక్తదానం చేసేలా మార్పు చెందాలని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు.తదనంతరం రక్తదానం చేసిన విజయ్ కూమార్ ను యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు,సభ్యులు అభినందనలు తెలిపారు
Admin
Voice Of India News