Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : విద్య వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో నూటికి 95 శా తం నిరుపేద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారని,ఆలాంటి నిరుపేద విద్యార్థులకు దాత ల సహకారం ఎంతో అవసరమని టీడీపీ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నా రు.శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం లోని బైరెడ్డి రాజశేఖరరెడ్డి నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వి.చెంచు రెడ్డి జ్ఞాప కార్థం ఏర్పాటు చేసిన భోజనశాలను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా బడి పిల్లలకు బైరెడ్డి స్వయనా భోజనం వడ్డించి మాట్లాడతూ దాతల సహకా రంతో తల్లితండ్రుల జ్ఞాపకార్థం ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలలో విద్యార్థుల కోసం భోజనశాల ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.మన రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,వి ద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల ప్రత్యేక శ్రద్ధ వల్ల డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నా రని,విద్యార్థుల కోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో ఇలాంటి భోజనశాల ఏర్పాటు చేస్తే పరిశు భ్రమైన వాతావరణంలో విద్యార్థులు భోజనం చేసి ఆరో గ్యవంతంగా ఉంటూ మంచి చదువులు చదువుకునేం దుకు దోహధపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో దాతలు ప్రభాకర్ రెడ్డి,నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ డి.సుధాకర్ రెడ్డి,కౌన్సిలర్ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు
Admin
Voice Of India News