Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి పాగాలంకరణ ఘనంగా ముగిసింది. బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పుర స్కరించుకుని శ్రీశైలమహాక్షేత్రంలో మహాన్యా స పూర్వక రుద్రాభిషేకం లింగోద్భవం సమ యంలో చీరాల వాస్తవ్యులు పృధ్వి వెంకటే శ్వర్లు ఎంతో నిష్టతో భక్తిశ్రద్ధలతో శ్రీ భ్రమరాం బ మల్లికార్జున అమ్మ వార్లను తలుచుకుం టూ స్వామివారికి పాగా చుట్టి అలంకరిం చారు.రోజుకు మూర చొప్పున నేత నేస్తూ 365 రోజులు పాటు తయారు చేసిన పాగా ను స్వామివారికి సమర్పించి ఆలయ సాంప్ర దాయబద్ధంగా పాగాను అలంకరించారు.ఈ పాగాలంకరణ ఘట్టం దాదాపు గంటన్నర పా టు జరిగింది. ఈ ఘట్టంలో భక్తులు శివనామ స్మరణతో శ్రీశైల మహా పుణ్యక్షేత్రం మారు మోగింది
అనంతరం రమణీయం.కమనీయంగా నయ నానందకరంగా నాగలకట్ట సమీపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కల్యాణ తంతు వైభవోపేతంగా సాంప్రదాయ రీతిలో జరిగింది అశేష భక్త జనవాహిని మ ధ్య కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి.ఈ ఉత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియా,జాయింట్ కలెక్టర్ సి విష్ణు చర ణ్,శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,శ్రీశైల దేవస్థానం బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీని వాసులు తదితరులు పాల్గొన్నారు
Admin
Voice Of India News