Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూల్ టౌన్ లో మహిళలు విద్యార్థుల పట్ల ఈవ్ టీజింగ్ ఆకతాయి పనులకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూల్ డిఎస్పి జె.బాబు ప్రసాద్ హెచ్చరించారు.ఆదివారం డిఎస్పి జె.బాబు ప్రసాద్.సిఐ లు ఓ.మహేశ్వర్ రెడ్డి,విజయలక్ష్మిల ఆధ్వ ర్యంలో 11 మఫ్టీ పోలీసు బృందాలతో యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ల ను ఏర్పాటు చేశామన్నారు.ఎవరైనా ఆకతాయిలు అసభ్య ప్రవర్తనతో ఈవ్ టీజింగ్ కు పాల్పడినట్లయితే,అట్టి వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందన్నా రు
కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ,ప్రైవేట్ హాస్టల్స్,షాపిం గ్ మాల్స్,రైల్వేస్టేషన్,తదితర పరిసర ప్రాంతాలలో యాంటీ ఈవ్ టీజింగ్ మఫ్టీ పోలీస్ బృందాలు తనిఖీ చేశారు.ఈవ్ టీజర్స్ ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందు లు ఉన్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకు రావాలని ఉమెన్ హాస్టల్స్,కళాశాలలు,పాఠ శాలల బాలికల వసతి గృహాలలో విద్యార్ధిని లకు అవగాహన కల్పించారు. యాంటీ ఈవ్ టీజింగ్ ను అరికట్టాలనే ఉద్దే శ్యంతో విద్యా ర్ధినులపై జరిగే అసభ్య ప్రవర్తనలను పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతో యాంటి ఈవ్ టీజింగ్ బీట్స్ పనిచేస్తున్నాయని కర్నూల్ డిఎస్పి జె.బాబు ప్రసాద్ తెలిపారు.ఎక్కడై నా మహిళలకు,విద్యార్థినిలకు సమ స్యలు ఉన్నట్లయితే డయల్ 112 కి కాల్ చేసి నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని,లేదా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి SOS యాప్ లేదా శక్తి వాట్సప్ 7993 485111 నెంబర్ కి మెసేజ్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు
కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లారెడ్డి కళాశాల వద్ద ఈవ్ టీజింగ్ కు పాల్పడిన ఆకతాయిలను ఎస్ఐ సురేష్ కౌన్సిలింగ్ చేశారు
Admin
Voice Of India News