Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం గంజాయి,మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆకస్మిక తనిఖీలు,నాకా బంది నిర్వహించాలని కర్నూలు పోలీసులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారని కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ తెలిపారు.డిస్పీ జె.బాబు ప్రసాద్ రైల్వేస్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని.కర్నూల్ రైల్వే స్టేషన్,కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు.ఆంధ్ర -ఒరిస్సా బార్డర్ నుండి డ్రగ్స్,మాదకద్రవ్యాలు అక్రమంగా రవా ణా జరుగుతుందని సమాచారం రావడంతో ఈ తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు.మాదక ద్రవ్యాల పై ఈగల్ టీం,కర్నూల్ పోలీసులు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమా లు కూడా నిర్వహిస్తున్నారన్నారు.యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని,డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే ఈగల్ టీం టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి సమాచారం అందించాలన్నారు.దేవీ నవరా త్రులు ప్రారంభమైనందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రజలు పోలీసుల కు సమాచారం అందించి సహకరించాలన్నారు.సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.కొందరు వ్యక్తులు ప్రయాణికుల చాటున ఎటువంటి అనుమానం రాకుండా రైళ్ల లలో డ్రగ్స్, గంజాయి వంటి అక్రమ రవాణా పాల్పడుతుంటారన్నారు.కర్నూల్ పోలీసులు,జి ఆర్ పి పోలీసులు,డాగ్ స్క్వాడ్,బాంబ్ స్క్వాడ్ పోలీసులు,స్పెషల్ పార్టీ పోలీసులతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.అనంతరం కర్నూల్ నుండి నంద్యాల కు వెళ్తున్న రైలులో (77209) తనిఖీలు నిర్వహించారు.రైల్వే స్టేషన్ లోని పార్సిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.పార్సిల్ కార్యాలయంలో పార్సిల్స్ అనుమానాస్పదంగా ఉన్నా,నెలల తరబడి ఎక్కువ రోజులు పార్సిల్స్ డెలివరీ కాకుండా ఉన్నట్లయితే అటువంటి సమాచారాన్ని కర్నూలు పోలీసులకు అందించాలని రైల్వే పార్సిల్ కార్యాలయం సిబ్బందికి కర్నూలు డిఎస్పి తెలియజేశారు.ఈ తనిఖీలలో కర్నూల్ డిఎస్పి తో పాటు కర్నూల్ టూ టౌన్ సీఐ నాగరాజారావు,కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహా,కర్నూలు టు టౌన్ ఎస్సై సతీష్ కుమార్ యాదవ్,కర్నూలు నాల్గవ పట్టణ ఎస్సై రామ మునయ్య,స్పెషల్ పార్టీ పోలీసులు,డాగ్ స్వాడ్,బాంబ్ డిస్పోజల్ టీం,జిఆర్ పి పోలీసులు పాల్గొన్నారు.
Admin
Voice Of India News