Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : రాజకీయ విద్వేషాలతో కొన్ని పత్రికలు నిరాదార తప్పు డు కథనలు ప్రచురణ చేయడం సరికాదని,అటువంటి పత్రికలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రాయలసీమ రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ పేర్కొన్నా రు.ఒక ప్రముఖ పత్రికలో తనపై వ్యక్తిగతంగా టార్గెట్ చేసి,రాయలసీమలో అనకొండ ఐపిఎస్ వార్తను ప్రచుర ణ చేసిన నేపథ్యంలో రాయలసీమ రేంజ్ డీఐజి కోయ ప్రవీణ్ స్పందించారు.ఈ మేరకు జిల్లా డిఐజి కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా రు.ఈ సందర్బంగా డిఐజి కోయ ప్రవీణ్ మాట్లాడుతూ రాజకీయంగా అధికారులపై తప్పుడు వార్తలు ప్రచురణ చేయడం తగదన్నారు.గతంలో విశాఖపట్నంలో తాను ఎస్పీగా పని చేసిన కాలంలో గంజాయి సాగు పెద్దఎత్తున రవాణా జరిగినట్లు పేర్కొన్నారు.అదేవిదంగా అసంఘీక కార్యక్రమాలు జరిగాయని చెప్పారు.ఆ సమయంలో వాటిని కట్టడి చేసిన పరిస్థితి ఉందన్నారు.అదేవిదంగా తాను పనిచేసిన ప్రాంతాలలో అసాంఘీక కార్యక్రమాలపై నిబద్దతతో పని చేయడం కొందరు రాజకీయ దళారుల కు నచ్చ లేదన్నారు.దీంతోనే తనపై గతంలో అనేక కుట్ర లు చేశారని ఆకుట్రలు సైతం ధీటుగా ఎదుర్కొన్నట్లు పే ర్కొన్నారు.అదేవిదంగా ప్రస్తుతం కుట్ర పూరిత చర్యలకు ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.అందులో భాగంగా నే నేడు తప్పుడు వార్త ప్రచురణ చేయడం జరిగిందన్నా రు.వ్యవస్థలో పాతుకుపోయిన దళారీల వల్ల నిబద్దత కలిగిన అధికారులపై ఇలాంటి కుట్రపూరిత చర్యలు జరుగుతాయని చెప్పారు.ఏదిఏమైనా తనపై తప్పుడు వార్త ప్రచురణ చేసిన సంస్థ,సిబ్బందిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని డిఐజి తెలిపారు
Admin
Voice Of India News