Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : భక్తి అనేది కేవలం పూజలోనే కాదు,సేవలో కూడా ప్రతిఫ లించాలని,భక్తి మనసును పవిత్రం చేస్తుంది,సేవ సమా జాన్ని బలపరుస్తుందని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థా పక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష అన్నారు.మంగళవారం బళ్లారి చౌరస్తాలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో దీక్ష స్వీకరించిన ఆంజనేయ,అయ్యప్ప,శివ స్వాములకు కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడు తూ భక్తి మార్గం సేవామార్గంగా మారినప్పుడే నిజమైన ఆధ్యాత్మికత సాధ్యమవుతుందని,అన్నదానం ఆత్మసం తృప్తి కలిగించే పుణ్యకార్యం అని, సేవలోనే నిజమైన భక్తి ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు.అంతకన్నా ముందు ఆల యంలో శ్రీహర్ష ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆయన ను ఈవో దినేష్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో గోశాల కమిటీ మాజీ సభ్యులు శ్రీకాంత్,మాజీ ఎంపిటిసి రఘు నందన్ రెడ్డి,కేపియస్ సభ్యులు శ్రీరాములు,మోహన్, శ్రీనివాసులు,నాగరాజు,రామాంజనేయులు,ప్రేమ్,భార్గ వ్,వెంకట్,సునీల్,మహేష్ తదితరులు పాల్గొన్నారు
Admin
Voice Of India News