Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు జిల్లా,కోడుమూరు మండలం,స్థానిక సిపిఎం కా ర్యాలయంలో ఆదివారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) కోడుమూరు మండలం జర్నలిస్ట్ ల సమావేశం సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మన్న అధ్యక్షతన ఏర్పాటుచేయడం జరిగింది.సమావేశానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్,జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్,జిల్లా నాయకులు వి.విజయ్ కుమార్,జి.విజ య్ కుమార్ హాజరయ్యారు.ముందుగా మండలంలో జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ అడ్ హక్ కమిటీ ఎన్నిక జరిగింది.కమిటీ అధ్య క్షులు ఎం.లక్ష్మ న్న,కార్యదర్శిగా ఎం.కృష్ణ, ఉపాధ్యక్షలుగా బి.వీరన్న,స హాయ కార్య దర్శిగా కె.సురేష్లను మండల జర్నలిస్ట్ ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు.ఈ సంద ర్బంగా దండు విద్యాసాగ ర్ మాట్లాడారు.మండలంలో జర్నలిస్ట్ ల పిల్లలకు విద్యా రాయితీ,అక్రిడిటేషన్,హెల్త్ స్కీమ్,ఇళ్ల స్థలాలు వంటి ప్రధాన సమస్యలపై చర్చించారు.వీటి పరిష్కారం కోసం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) నిర్వహించే పోరాటాల కు మండల జర్న లిస్ట్ తమ సహకారం అందించాలని కోరారు.అనంతరం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) సభ్యత్వం నమోదు ప్రారంభించారు.
Admin
Voice Of India News