Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 17 వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో పాల్గొంటున్న కర్నూలు జిల్లా స్విమర్స్ ను రాష్ట్ర మానవ వనరుల శాఖా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు.డిల్లీ పర్యటనకు వచ్చిన లోకేష్ ను సోమవారం న్యూ ఎంపీ ఫ్లాట్స్ లో క్రీడాకారులు పి.హేమలత,కె.శృతి,సిరి చేతన రాజ్, పి.లహరిలు కలిశారు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు.ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.ఎంచుకున్న రంగంలో ప్రతిభ చాటుతూ ఉన్నతంగా రాణించాలని సూచించారు
Admin
Voice Of India News