Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : ప్రతిఒక్కరు రక్తదానం పట్ల అవగాహనా పెంచుకోవాలని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడుకోవచ్చు అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) రాష్ట్ర నాయకులు నీలం సత్యనారాయణ, కర్నూలు నగర కార్యదర్శి మునిస్వామిలు అన్నారు.బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వాయిస్ ఆఫ్ ఇండియా స్టాఫ్ రిపోర్టర్ జె. నాగరాజు సతీమణి జె.లక్ష్మిదేవికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నాయకులు, మన తెలుగు దినపత్రిక,విఎస్ 9 టీవీ కర్నూలు ప్రతినిధి వి.విజయ్ కుమార్ రక్తదానం చేశారు.ఈ సందర్బంగా నీలం సత్యనారాయణ, మునిస్వామిలు మాట్లాడారు.జె.లక్ష్మీదేవి అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతుంది.ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న విజయ్ కుమార్ ఆమెకు రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరికి రక్తం అవసరం ఏర్పడుతుందని అన్నారు.మానవత్వంతో వారికి రక్తం ఇవ్వడం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోగలిగిన వారమవుతాం అని చెప్పారు.రక్తదానం పట్ల ప్రజలకు ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం రక్తదాత విజయ్ కుమార్ ను అభినందించారు.విజయ్ కుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటికే సుమారు 10సార్లు రక్తదానం చేశానని తెలిపారు.రక్తదానం చేసిన సందర్బంలో బాధితుల కళ్ళలో సంతోషం నాకు ఆశీర్వాదాలుగా భావిస్తానని చెప్పారు. రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం కలగదని,కొద్దిరోజులోనే మన శరీరంలోకి కొత్త రక్తం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ శ్రీనివాసులు,జె.నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.
Admin
Voice Of India News