Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : గత వైసీపీ పాలనలో చేసిన ఆర్ధిక దోపిడీ వల్ల రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా పేద రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ను వెంటనే విడుదల చేసి ఆదుకుంటున్నారని టీడీపీ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ద్వారా మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బైరెడ్డి రాజశేఖరరెడ్డి శుక్రవారం బాధితులకు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో దైర్యం ఇస్తుందన్నారు.నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల కు చెందిన దూదేకుల ఉసేనమ్మకు రూ.1,42,136 లక్షలు,కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామా నికి చెందిన లక్కసాగరం జయలక్ష్మికి రూ 20,000 వేలు, అవుకు మండలం చాగలమర్రికి చెందిన జెట్టి యశ్వంత్ రెడ్డికి రూ. 52,065వేలు,నందికొట్కూరు మండలం 10.బొల్లవరం గ్రామానికి చెందిన వి.లక్ష్మీదేవమ్మ రూ.65,000 వేలు,ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన Y రామసుబ్బారెడ్డికి రూ.64,167వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అందజేశారు
Admin
Voice Of India News