Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : మైనర్లువాహనంనడుపుతూ పట్టుబడితే వాహనం ఇచ్చిన వారి,తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ తెలిపారు.కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూల్ నగరంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే మైనర్లపై చర్యలు తీసుకు నేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్న ట్టు తెలిపారు.రాజ్ విహార్ సెంటర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వ హించారు.లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న మై నర్లను పట్టుకున్నట్టు తెలిపారు
15 మంది మైనర్లను కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చిహెచ్చరించినట్టు తెలిపారు. మైనర్లు పట్టుబడితే తక్షణమే కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామ ని,మార్పు రాకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు.అనంతరం లైసెన్స్ లేకుండా బండి న డపబోమని మైనర్లచేత ప్రతిజ్ఞ చేయించారు.వాహనదా రులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనల వీడియో షోలు మరియు పవర్ పా యింట్ ప్రెజెంటేషన్లు మైనర్లకు చూపించారు.మొదటిసా రిగా కౌన్సిలింగ్ చేసి,రెండవసారి పట్టుబడితే జరిమానా లు విధించనున్నామని ట్రాఫిక్ సిఐ మనసురుద్దీన్ తెలి పారు
Admin
Voice Of India News