Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కృషి చెస్తుందని , "దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ" కి సహకరిస్తానని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి వి జయనాగేశ్వర రెడ్డి అన్నారు.బుధవారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మల్లేల గ్రూప్స్ అధినేత, సామాజిక వేత్త, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘాల గౌరవాధ్యక్షులు, డాక్టర్ మల్లేల ఆల్ఫ్రెడ్ రాజు గారి అధ్యక్షతన రాష్ట్ర "దివ్యాంగుల సాధికారత ఫోరం" (డిఈఎఫ్) అధ్యక్షులు బి సి నాగరాజు మరియు జేఏసీ కార్యవర్గ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అందరూ కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు సంబంధించిన మూడు వేల పెన్షన్ ను ఆరు వేలకు పెంచినందుకు అలాగే మిగతా హామీలను అమలు చేస్తామని చెప్పినందుకు కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం నుంచి ఆలూరు టూ అమరావతి వరకు "ఎన్డీఏ కూటమి కి ధన్యవాదాలు తెలుపుకునేందుకు" దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ" చేపట్టబోతున్నట్లు కావున ఎన్డీఏ కూటమి భాగస్వాములైన టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ని, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరిని, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని మీ సమక్షంలో కలిసి మా దివ్యాంగుల సమాజం కృతజ్ఞతలు తెలియజేసుకునేందుకు తగిన సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి కి కృషి చేస్తానని అలాగే ఈ జిల్లా నుంచి సాగే "దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ" కి సహకరిస్తూ ఎన్డీఏ కూటమి నేతలను కలిపిస్తానని హమీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఈఎఫ్ కార్యవర్గ నాయకులు యు వీరేష్, ఎస్. వెంకటేష్, ఈ. రాజశేఖర గౌడ్, వి నర్సింహులు, రామదాస్, అటో భాషా మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన వికలాంగులందరూ పాల్గొన్నారు.
Admin
Voice Of India News