Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : అవినీతి నిర్మూలన కోసం యువత నడుంబిగించాలని, మన దేశం పురోగతి మరియు శ్రేయస్సు సాధించాలంటే అవినీతిని నిర్మూలించాలన జరగాలని యూత్ ఫర్ యాంటి కరెప్షన్ స్టేట్ అడ్వజర్ కొంకతి వేణు గోపాల్ .బిసి జన సభ అధ్యక్షులు టి శేషిఫణి.రాయలసీమ విద్యార్థి జెఎసి చైర్మన్ శ్రీ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు.స్థానిక కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు ఉన్న రాయలసీమ విద్యార్థి జెఎసి కార్యాలయంలో యూత్ ఫర్ యాంటి కరెప్షన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అవినీతి అనేది ప్రభుత్వ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని మరియు మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందన్నారు. మనమందరం అవినీతిపై పోరాడటానికి మరియు మన దేశానికి ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయడానికి కట్టుబడి ఉండాలని పిలుపు నిచ్చారు. సంపన్నమైన మరియు న్యాయమైన మరియు ప్రతి పౌరుడు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగల దేశాన్ని సృష్టించడానికి మనం కృషి చేద్దామని యువతను కోరారు. అనంతరం సంస్థ క్యాలండర్, ముందడుగు లోగో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రమణ కుమార్, విజయ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.
Admin
Voice Of India News