Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు నగరంలోని తిరుమలగిరి టౌన్ షిప్ నందు ఇం ట్లో అక్రమంగా 53 బాటిళ్ల ఆర్మీ మద్యం నిల్వచేసిన మాజీ ఆర్మీ అధికారి నగేష్ రావు ని అరెస్టు చేసినట్లు ఎ క్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ తెలిపారు.శనివారం జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం.సుధీర్ బాబు ఆదేశాల మేరకు కర్నూలు పరిసర ప్రాంతాలలో దాడులు చేస్తూండగా రాబడిన సమాచారం మేరకు మాజీ ఆర్మీ అధికారి నగేష్ రావు ఇంటిలో డిఫెన్స్ లిక్కర్ ఉందన్న సమాచారం మేరకు అతని ఇంటిని తనిఖీ చేయగా సు మారు 53 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.వాటిని పరి శీలించగా ఆర్ముడు పేరా మిలిటరీ ఫోర్సెస్ ఆర్మీ పర్సనల్ కు మాత్రమే అమ్మబడును అని ఉంది.వీటిని ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారని విచారించాగా బెంగళూ రులోని ఆర్మీ క్యాంటీన్ నందు తీసుకొని ఇక్కడ అధిక రేటుకు అమ్మడం కొరకు తెచ్చినట్లుగా తెలిపాడు.వాటిని పరిశీలించగా డివార్స్ విస్కీ18.బ్లాక్ డాగ్ గోల్డ్ 12.బ్లాక్ డాగ్ బ్లాక్ 12.రాక్ఫోర్డ్ 11 మొత్తం 53 బాటిళ్లు ని సీజ్ చేసి స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తిని అరెస్టు చేసి రి మాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు.ఈ దాడులలో ప్రొహిబిషన్ మరియు ఎస్సై రెహానా బేగం సిబ్బంది రామలింగ,చంద్రపాల్,మధు కిషోర్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈ ఎస్ టి ఎఫ్ రాజేంద్రప్రసాద్ ఎస్ఐ ఇంద్ర కిరణ్ తేజ సిబ్బంది రాణి,బషీర్,లాలప్ప తదితరులు ఉమ్మడిగా పాల్గొన్నారు
Admin
Voice Of India News