Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : మా అబ్బాయికి కర్నూలు నగరంలో ఒక పాఠశాలలో కాలం చెల్లిన పుస్తకాలు ఇవ్వడంతో కర్నూలు కలెక్టరేట్ లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని,ఆ స్కూల్ కరెస్పాండెంట్ భర్త స్కూల్ కు వెళ్ళిన నా కుమారుడుని కొట్టాడని వారి పై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని కర్నూలు,మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన రవితేజ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)లో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం కర్నూలు కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాల యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి,పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి సోమవారం మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని 1) మెడికల్ ఎజెన్సీ లో పని చేస్తున్నాను. ట్రైన్ లో వెళ్తుంటే బిసి వేల్పేర్ సాంఘిక సంక్షే శాఖ అధికారులతో నాకు పరిచయాలు ఉన్నాయని చెప్పి నమ్మించి , ఎదైనా బిసి గురుకుల కళాశాలలో క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన సుధాకర్ రూ. 2 లక్షలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు, దేవనగర్ కు చెందిన ఎమ్. కృష్ణుడు ఫిర్యాదు చేశారు. 2) పోతి రెడ్డి అనే వ్యక్తి కాల్ మనీ పేరుతో అధిక వడ్డీలతో నా భర్త రఘుపతి రెడ్డి ని ఇబ్బందులకు గురి చేశాడు.అప్పుల భాదలు భరించలేక నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.ఇంకా ఆస్తులు రాసి ఇవ్వాలంటూ మరల మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు తాలుకా ,పసుపుల గ్రామం కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు. 3) స్నేహితుల ద్వారా పరిచయమైన విజేత సౌధాయ్ అనే మహిళ హైదరాబాద్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 1 లక్ష 85 వేలు ఆన్ లైన్ పేమెంట్ చేయించుకుని మోసం చేసిందని జోహారాపురం , ఇందిరమ్మ కాలనీకి చెందిన జాదవ్ మనీ భాగ్య తేజ ఫిర్యాదు చేశారు. 4) కర్నూలు,బాలజీనాగర్ లో ఉండే రామకృష్ణయాదవ్ నా యొక్క రెండు ప్లాట్ ల ను ఆక్రమించుకుని షెడ్లు వేసి గుంటూరుకు చెందిన వ్యక్తి కి అద్దెకి ఇచ్చాడని న్యాయం చేయాలని కర్నూలు బాలజీ నగర్ కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు. 5) ఆదోని,బార్ పేట కు చెందిన సోనీ అనే మహిళ పొదుపు లక్ష్మీ గ్రూప్ ల నుండి రూ. 70 లక్షలు తీసుకోని మోసం చేసి పరారీలో ఉన్నదని,అంబికా,రఫియా,సౌమ్య,వనీత, బందేనవాజ్, జగదీప్ తదితర పొదుపు గ్రూపులలోని మొత్తం డబ్బులు సోనీ తీసుకొని వెళ్ళి పోయిందని వాటిని ఇప్పించి న్యాయం చేయాలని ఆదోని, పింజరిగేరికి చెందిన పొదుపు గ్రూపుల మహిళలు సంధ్యకుమారి, మస్తాన్ బి, రంజాన్బీ,మెహరున్ బీలు ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సిఐ లు పాల్గొన్నారు.
Admin
Voice Of India News