Saturday, 31 January 2026 07:48:37 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

మాంటిస్సోరి సంస్థల గోల్డెన్ జూబ్లీ సంబరా లకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రాక

50 వసంతాలు విద్యా సేవలో కర్నూలు మాంటిస్సోరి పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలు

Date : 11 November 2025 09:49 PM Views : 149

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు నగరంలోని ఏ.క్యాంప్ లో ఉన్న మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ లో నిర్వహించనున్న మాంటిస్సోరి సంస్థల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దు ల్ నజీర్ పాల్గొంటారని మాంటిస్సోరి సంస్థల నిర్వాహకులు తెలిపారు.కర్నూలు నగరంలో విద్యప్రమాణాలకు మారుపేరుగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన కర్నూలు మాంటిస్సోరి పాఠశాల ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది.50 వసంతాల విద్యాయజ్ఞం పూర్తి చేసుకొని స్వర్ణోత్సవశోభను సంతరించుకోవడం కర్నూలు పట్టాణానికే గర్వకారణం.ఈ సందర్భంగా స్వర్ణ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి పాఠశాల యాజమాన్యం సిద్ధమవుతుంది.50 సంవత్సరాల క్రితం కర్నూలు నగరం,విద్యానగర్ లో కేవలం 12మంది విద్యార్థులతో ఒక చిన్న మొక్కగా ప్రస్థానం ప్రారంభించి,నేడు శాఖోపశాఖలుగా విస్తరించి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తొమ్మిది ప్రాంతాలలో శాఖలను విస్తరించి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. నాణ్య మైన విద్యవినూత్న బోధన పద్దతులు అద్భుతమైన ఫలితాలతో ఈ రాయలసీమలో ఒక మకుటం లేని మహా రాజుగా ఉన్నత స్థాయి విద్యా సంస్థగా మాంటిస్సోరి పాఠశాల ఎదిగింది.ఎందరో ప్రము ఖులు,నిష్ణాతులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఈ పాఠశాలది.ఐదు దశాబ్దాలుగా విద్యను బోధించడమే కాకుండా వేలాది మంది విద్యార్థులను భావి భారత ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దిన విద్యాదేవాల యంగా మాంటిస్సోరి పాఠశాల ప్రసిద్ధి చెందింది.ఇక్కడ చదువు తో పాటు విలువలకు అధికంగా ప్రాధాన్యం ఇస్తారు.క్రమశిక్షణ,నిజాయితీ,పెద్దల పట్ల గౌరవం,సామాజిక స్పృహ వంటి మహోన్నత లక్షణాలను విద్యార్థి మదిలో నింపడం ఈ పాఠశాల ప్రత్యేకత.మాంటి స్సోరి అనేది కేవలం పాఠశాల పేరు కాదు.నాణ్యతతో కూడుకున్న విద్యకు,సంస్కారానికి చిరునామాగా తీర్చిదిద్దిన పాఠశాల వ్యవస్థాపకులైన కళ్యాణమ్మ కలను సాకారం చేస్తున్న ఉపాధ్యాయులు,బోధనేతర సిబ్బంది,పూర్వ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం హృదయ పూర్వక అభినందనలు తెలియచేసింది.

అదేవిదంగా రాబోయే తరాలకు కూడా ఈ పాఠశాల ఇదే స్పూర్తితో వెలుగులు విరజిమ్మాలని,ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల స్వర్ణ జయంతి ఉత్సవాలు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రారంభించబడుతున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇదే పాఠశాల పూర్వ విద్యార్ధి మన రాష్ట్ర మంత్రివర్యులు టి.జి. భరత్,కర్నూలు పార్లమెంట్ సభ్యులు బి.నాగరాజు,నంద్యాల పార్లమెంటు సభ్యులు డా.బైరెడ్డి శబరి, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి, కోడుమూరు శాసన సభ్యులు పి. దస్తగిరి,నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య,ఎమ్మిగనూరు శాసన సభ్యులు జయ నాగేశ్వర రెడ్డి,కర్నూలు రేంజ్ డి.ఐ.జి.కోయ ప్రవీణ్,కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి,ఇతర ప్రముఖులు పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.ఈ చారిత్రక ఘట్టంలో భాగ స్వాములు కావాలని ఈ శుభ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలని కోరుకుంటూ పాఠశాల పూర్వ విద్యా ర్థులు,పూర్వ అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది,తల్లిదండ్రులు,శ్రేయోభిలాషులు పుర ప్రముఖులను సాదరంగా పాఠశాల యాజమాన్యం ఆహ్వానం పలుకుతోంది.

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :