Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయంకు సీనియర్ పాత్రికేయులు బి లక్ష్మీనారాయణ కుర్చీలు అందించారని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కర్నూల్ నగరంలో ఏ క్యాంప్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయంకు కల్పించాల్సిన వసతులు చాలా ఉన్నాయని,దాతృత్వం కలిగిన వారు ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు.పాత్రికేయులు న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎంతోమంది పాత్రికేయులు ప్రెస్ క్లబ్ కోసం పోరాటాలు చేశారని,ఫలితం లేకపోవడంతో నిరాశతో ఉండిపోయారని ఆయన తెలిపారు.సీనియర్ పాత్రికేయులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.సోషల్ మీడియాలో వివిధ మీడియాలో దాతృత్వం కలిగిన వారు ముందుకు వచ్చి చేయూత ఇస్తున్నట్లు చూడటం జరిగిందన్నారు.తాను కూడా ఈరోజు కార్యాలయంకు కావలసిన ప్రధానమైన కుర్చీలను 12 ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ కరణ్ పాత్రికేయులు సత్యనారాయణ పాల్గొన్నారు
Admin
Voice Of India News