Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : పత్తి రైతులకి అని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తెలిపారు.మంగళవారం కోడుమూరు మండలం శ్రీ వాసవి కళ్యాణ పరమేశ్వరి మండపంలో పత్తి రైతులు, మందులు పిచికారి చేసే వారు,పత్తి ఏరేవారి కోసం ప్రత్యేక శిక్షణ,సబ్సిడీ పై పరికరాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మరి సంస్థల వారు పత్తి రైతులకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు.పీపీఈ కిట్లు,ఏప్రాన్,పత్తిని నిల్వ చేసుకునేందుకు బ్యాగ్ లు సంబంధిత వాటిని మరి సంస్థ వారు అందిం చడం అభినందించాల్సిన విషయం అన్నారు.అదే విధంగా రైతులను లెర్నింగ్ గ్రూప్ ల కింద ఏర్పాటు చేసి వారికి ఎప్పటికపుడు శిక్షణ తరగతులను నిర్వహించి పత్తి రైతులకి అని రకాల స హాయ సహకారాలు అందిస్తున్నారన్నారు.క్రిమిసంహారక మందులు అవసరం మించి ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారని,ఎంత మోతాదులో మందులు వాడాలి అని రైతులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో పత్తి రైతులకి తెలియజేసిన సూచనలు అన్ని కూడా రైతులు అవలంబించే విధంగా వ్యవసాయ అధికా రులు మానిటర్ చేయాలని జాయింట్ కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.పత్తి రైతులు మరియు కార్మికులు తప్పనిసరిగా ఈ రక్షణా పరికరాలను వినియోగించుకోవాలని, తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని జాయింట్ కలెక్టర్ రైతులకు సూచించారు. రైతులు పంట ఉత్పత్తిని పెంపొందించుకోవడంతో పాటు, సురక్షితమైన వ్యవసాయ పద్ధతులను పా టించాలని కోరారు.రైతులకు, పురుగు మందులు వేసే వాళ్ళకి, కూలీలకు పి.పి.ఈ కిట్స్, టోపీ, షర్టు, ఏప్రాన్, పికింగ్ బ్యాగులు వంటి రక్షణ వస్తువులను పంపిణి చేసారు.తొలుత కోడుమూరు మం డలం ప్యాలకుర్తి గ్రామంలోని బెటర్ కాటన్ ప్రాజెక్ట్ లో భాగంగా వెంకన్న అనే రైతు పొలంను జాయింట్ కలెక్టర్ సందర్శించి గ్రామ రైతులతో మాట్లాడారు.పొలంలో సాగు చేస్తున్న అంతరపం ట, సరిహద్దు పంటగా ఉన్న సజ్జను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.పురుగుల ఉదృతి తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, పంట పరిస్థితి, కాయల లక్ష ణాలు, పత్తి పింజ నాణ్యత మొదలైన అంశాలను జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. అలాగే, రైతులతో దిగుబడి స్థితి పై వివరంగా చర్చించారు. రైతులు మాట్లాడుతూ సుస్థిర పద్థతులు వాడడం వాళ్ళ పురుగుమందుల వాడకం తగ్గించాము అని పెట్టుబడి తగ్గింది అని జాయింట్ కలెక్టర్ కి తెలిపారు.కార్యక్రమంలో నాబార్డ్ డిడిఏం సుబ్బారెడ్డి, ఎల్డిఎం రామచంద్ర రావు, వ్యవసాయ అధికారి వరలక్ష్మి, కేవీకే – బణవాసి ప్రముఖ సమన్వయకర్త డా. కె. రాఘవేంద్ర చౌదరి, MARI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రామిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
Admin
Voice Of India News