Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆక్సీజన్ కొనుగోలులో జరిగిన అవకతవ కలపై విచారణ జరిపించాలని RGN హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్,కర్నూలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నీలం సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఆజాద్ లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అవినీతి పట్ల రాష్ట్ర మంత్రి పిర్యాదు చేసిన కూడా అధికారులు స్పందించకపోవ డం బాధాకరం అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూబీక్ మీటర్ రూ.13కొనుగోలు చేస్తే,ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం క్యూబీక్ మీ టర్ రూ.30ఖర్చు చేసి కొనుగోలు చేయడంలో అంతర్యం ఏంటో ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సీజన్ సరఫరా చేసిన సంస్థలపై కఠినచర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.
Also Read : ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి.బైరెడ్డి రాజశేఖరరెడ్డి
Admin
Voice Of India News