Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలక మని,నగరాన్ని ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి పౌరుడు త మ సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషన ర్ పి.విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు.బుధవారం ఆయన నగర పాలక కార్యాలయంలోని విలేకరుల సమావేశం నిర్వ హించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెరు గైన పారిశుద్ధ్య నిర్వహణకు నగర ప్రజలు సహకరించి, ఇకపై తడి,పొడి చెత్తా వేర్వేరు చేసి కార్పొరేషన్ సిబ్బంది కి అందించాలని కమిషనర్ కోరారు.బహిరంగ ప్రదేశాల్లో, డ్రైనేజీ కాలువల్లో చెత్తాచెదారం వేయోద్దని సూచించా రు.సాలిడ్ వెస్టేజ్ మేనేజ్మెంట్‌ను సమర్థవంతంగా అమ లు నిర్వహించగలిగితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రొత్సా హం లభిస్తుందన్నారు. తమ సిబ్బంది ఎంతలా కష్టపడు తున్నప్పటికి,ఆశించిన స్థాయిలో ప్రజల సహకారం లేక పోవడంతో కార్మికుల కష్టం వృథా అవుతుందన్నారు.ప్ర జలు స్వచ్ఛందంగా సంపూర్ణ సహకారం అందిస్తే మార్పు సుస్పష్టంగా కనబడుతుందన్నా రు
సి&డి వేస్టేజ్ నిర్వహణకు నూతన విధానం భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు సరికొత్త విధానం తీ సుకొస్తున్నామని కమిషనర్ వెల్లడించారు.ఆగస్టు1 నుం డి ప్రత్యేక నెంబర్ పెట్టి,వాటి ద్వారా నగర పరిధిలో సి&డి వేస్టేజ్ సేకరించి,జొహరపురం డంపింగ్ యార్డ్ వద్ద నున్న సి&డి వేస్టేజ్ మేనేజ్మెంట్ ప్లాంట్లకు తరలిస్తామని చెప్పారు.తద్వారా రీసైక్లింగ్ ప్రక్రియ చేపట్టి పునర్విని యోగానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ట్రాక్ట ర్‌కు రూ.500,టిప్పర్‌కు రూ.1000 చొప్పున రవాణా రు సుము మాత్రమే ప్రజలు చెల్లించుకోవాల్సి ఉంటుందన్నా రు.ఫలితంగా నగరంలో నిర్మాణపు వ్యర్థాలను లేకుండా చూడవచ్చని కమిషనర్ పేర్కొన్నారు
పశువులను రహదారులపై వదిలితే చర్యలు నగర రహదారులపై పశువులను వదిలితే ఇకపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.రహదారుల పై సంచరించే పశువులను ఆధీనంలోకి తీసుకొని,మూ డు రోజుల్లోపు వచ్చిన యజమానులకు జరిమానా వి ధించి పశువులను అప్పగిస్తామని పేర్కొన్నారు.మూడు రోజుల్లోపు పశువులను తీసుకెళ్లని పక్షంలో వాటిని గోశా లకు తరలిస్తామన్నారు.వీధి శునకాల బెడద నివారణకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను రోజువారీ సామర్ధ్య సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగర ప్రజలకు24గంటల పాటు సేవలు అందించేందుకు సిబ్బందితో ప్రత్యేక బృందం,ఒక టోల్ ఫ్రీ నెంబర్ త్వరలో ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు.వాటిని ద్వారా తాగు నీటి సమస్య,వీధి దీపాలు,పారిశుద్ధ్యం,ఇతరత్రా సేవలను సులువుగా పొందవచ్చని సూచించారు.నగరా భివృద్ధికి పన్నులు పెంచకుండా ప్రభుత్వాలు ఎంతగానో సహకరిస్తున్నాయని,ఆర్థికంగా బలంగా ఉంటేనే మౌలిక సదుపాయాల కల్పన,నగరాభివృద్ధి సాధ్యం అవుతుంద న్నారు.ప్రస్తుతం ఉన్న పన్నులను కూడా కొంతమంది చె ల్లించకపోవడం సమంజసంకాదని కమిషనర్ అభిప్రాయ పడ్డారు.కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయం పన్నులే అని,ఏ టా రూ.100 కోట్ల ఆదాయం నగరపాలకకు రావాల్సి ఉం టుందన్నారు.అయితే కొంతమంది పన్నుల చెల్లింపునకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వస్తుందని, వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలనుఏర్పాటు చేశామని ,వారికి పన్నుదారులు సహకరించి సత్వరమే తమ ఆస్తి, కొళాయి,ట్రేడ్,వినోద పన్ను బకాయిలను చెల్లించి నగరా భివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు.నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తు న్నామని,రహదారులు,డ్రైనేజీ కాలువల నిర్మాణం,వీధి దీపాలు,గుంతలు పూడ్చటం వంటి పనులను ప్రాధాన్య త క్రమంలో చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు.న గరంలో తొలుత9పార్కులను ఎంపిక చేశామని,వాటి అ భివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపా రు.వర్షపునీరు నిలవకుండా డ్రైనేజీ కాలువలు,రహదా రులను పునః పరిశీలించి అవసరమైన చర్యలు తీసు కుంటామని చెప్పారు.నగరానికి60 ఎంఎ ల్‌డిల మురు గునీటి శుద్ది కేంద్రాలు అవసర మని,58ఎంఎల్‌డి ఎస్టీపి ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని,ఇంకా అవసరమై న2ఎం ఎల్‌డిల ఎస్టిపికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు అర్హులందరికీ ఇళ్ళులకు దరఖాస్తు చేసుకోవాలి నగరంలో ఇళ్ళులు లేని పేదలు గృహాల కోసం తమ స్థాని క సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు.2 సెంట్ల స్థలంతో పాటు నిర్మాణానికి ప్రభు త్వం సబ్సిడీ ఇస్తుందని,టిడ్కో నందు ఖాళీ గృహాలను సైతం కేటాయిస్తామని తెలిపారు.అర్హతలు ఉన్న ప్రతి ఒ క్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని,త్వరలో వీధి వ్యాపారుల కోసం జో న్లను ఏర్పాటు చేయబోతున్నట్లు కమిషనర్ వెల్లడించా రు.ఇకపై వీధి వ్యాపారులు ఎక్కడబడితే అక్కడ వ్యాపా రం చేసుకోకుండా,ఆమోదయోగ్యం ఉన్న ప్రదేశాల్లో వ్యా పారం చేసుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు.ఎవరీ జీ వనోపాధికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నా మని,వీధి వ్యాపారులంతా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి కోరారు.కార్పొరేషన్,సచివాలయ సిబ్బంది ప్రజల కు సేవలు అందించాల్సినని,అందులో ఎవరైనా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసు కుంటామని కమిషనర్ తెలిపారు.క్షేత్రస్థాయిలో స్థాయి లో ప్రతి ఉద్యోగి తమ విధులను సక్రమంగా నిర్వహించా లని,సమన్వయంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందా లన్నారు.కార్యక్రమంలో మేనేజర్ యన్.చిన్నరాముడు పాల్గొన్నారు
Admin
Voice Of India News