Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : జిల్లా ప్రగతికి గుండ్రేవుల ప్రాజెక్టు ద్వారానే బలమైన పు నాది పడుతుందని,గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించేంత వర కు పోరాడుతామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష అన్నారు.నగరంలోని ధర్నాచౌక్ వ ద్ద జల సమర దీక్ష చేపట్టిన ఆయనకు రెండో రోజు రైతు సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి,పులకుర్తి భాస్కర్ రెడ్డి,సుంకన్న,సిపిఎం పార్టీ నాయకులు రామకృష్ణ,ఏపీ స ర్పంచ్ సంఘం ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి,కర్నూ లు మేధావుల ఫోరం కన్వీనర్ మన్సూర్ర హేమాన్,డిప్యూ టీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక,కార్పొరేటర్ విక్రమసింహ రెడ్డి ,టీచర్స్ యూనియన్ నాయకులు రత్నం,భజరంగదళ్ ప్ర తాపరెడ్డి,సిపిఎం,జర్నలిస్టు సంఘాల నాయకులు సంఘీ భావం తెలిపారు.ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ క ర్నూలు నగరంతో పాటు పరిసర గ్రామాల్లో 10 లక్షల మం ది ప్రజలకు,2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గుం డ్రేవుల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా జిల్లా అన్ని రంగాల్లో వృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నా రు.ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం పార్టీలకతీతంగా నాయకు లు,ప్రజాసంఘాలు,రైతులు,యువత విద్యార్థులందరూ కలిసి వస్తేనే ప్రభుత్వాలు దిగి వస్తాయన్నారు.ఈ కార్యక్ర మంలో కేపియస్ నాయకులు హరినాథ్,శ్రీనివాసులు,నౌ షధ్,రామాంజనేయులు,ప్రేమ్,భార్గవ్,నాగరాజు,తదిరులు పాల్గొన్నారు
Admin
Voice Of India News