Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఈ నెల 24,25వ తేదీల్లో కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘జల సమర దీక్ష’కు జిల్లా నలుమూలల తరలి రావాలని కేపియస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష పిలుపుని చ్చారు.శుక్రవారం సి.బెళగల్,గూడూరు,కోడుమూరు మండల కేంద్రాల్లో రైతులతో కలిసి గోడ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో మన జిల్లా ఉండటం బాధాకరమైన విషయమని, ఇక్కడి నుండి హేమాహేమీలు,రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించినప్పటికి ఎవరికి ఒరిగేదేమీ లేదన్నారు.ఇకనైనా మన ప్రాంతం కోసం మనమే పోరాటం చేద్దామని,జల సమర దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.కర్నూ లు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో 10 లక్షల మందికి తాగునీరు,జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిం చే సామర్థ్యం ఉన్న గుండ్రేవుల ప్రాజెక్టును వెంటనే నిర్మాణం జరిగితే జిల్లా మొత్తం సస్యశ్యామలం కావడమే కాకుండా ప్రగతి పునాది పడుతుందని తెలిపారు.
Admin
Voice Of India News