Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు జిల్లా కల్లూరు మండలం,బొల్లవరం గ్రామంలో స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము మార్గశిర శుద్ధచ వితి సోమవారం తేది: 24-11-2025న శ్రీశ్రీశ్రీ ఈశ్వరమ్మ అవ్వ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ ఈశ్వర మ్మ అవ్వ ఆలయ కమిటీ నిర్వాహకులు పి.వి.రమణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉత్సవాలకు భక్తాదులు పెద్దఎత్తున పాల్గొని అవ్వగారి కృపకు పాత్రు లు కావాలని కోరారు.ఇందులో భాగంగా 24వ తేదీన ఉదయం గం.8:00ల నుండి గణపతి ప్రార్థన,గురుప్రార్ధ న,విశేష అభిషేకం,అర్చన నివేదన మహా మంగళ హారతి తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ప్రారంభమగు ను.గం.8:30 నుండి బిందె సేవ,గం.9:30 ఆరాధన కార్యక్రమం,విశేష ద్రవ్యములతో అభి షేకం,అర్చన మంగ ళహారతి,తీర్థ ప్రసాదం జరుగును.మధ్యాహ్నం గం.1:00 నుండి అన్నప్రసాదం,సాయంత్రం గం 6:00 ప్రభో త్సవం, నందికోల సేవ జరుగును.రాత్రి గం.9:00 "పంచ మాంకం" ఉచిత నాటక ప్రదర్శనలు జరుగుతాయి
అదేవిదంగా సోమవారం అంతరాష్ట్ర స్థాయి న్యూ క్యాట గిరి విభాగం ఆధ్వర్యంలో ఉదయం గం 8-00 బండలాగు డు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు దాతలు ప్రధమ బహుమతి చెట్ల మల్లాపురం,కాంపౌండర్ బోయలక్ష్మయ్య రూ.50000/-ద్వితీయ బహుమతి బొల్లవరం ఎన్.రమణారెడ్డి రూ.20000/-అనుగొండ ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎ.డి.ఈ వై.సుబ్రమణ్యం రూ.20,000/- మూడవ బహుమతి చెట్లమల్లా పురం ఎర్రమల రూ.10.000/-చిన్నటే కూరు కుర్వ లడ్డు రాముడు రూ.10,000/- చెట్లమల్లాపురం మాల గౌరయ్య రూ.10,000/-నాల్గవ బహుమతి నాయ కల్లు మోహన్ రెడ్డి రూ.20000/-ఐదవ బహుమతి నాయకల్లు ఆంజనేయులు రూ.5000/-చెట్లమల్లాపురం లక్ష్మమ్మ రూ.5,000/-ఆరవ బహుమతి చిన్నటే కూరు కుర్వ సిద్దమ్మ మునుమడు మద్ది లేటి రూ.5.000 ప్రకారంగా అందచేస్తు న్నట్లు పేర్కొన్నారు.పోటీలలో పాల్గొను వారు ఎంట్రీ ఫీజు రూ.600/-చెల్లించాలని, షరతులు వర్తిస్తాయని అన్నారు.ఇ తర వివరాలకు సల్మాన్ రాజు,ఎన్.రమణారెడ్డి సెల్ నంబర్లు 7997165419, 9963923563 లను సంప్రదించాలని ఆయన తెలిపారు.
Admin
Voice Of India News