Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, ఆదేశముల మేరకు మంగళవారం కర్నూలు టౌన్ నందు ధాడులు జరుపగా బంగారుపేట లో 50 లీటర్ల నాటు సారాను.కల్లూర్ ఎస్టేట్ నందు 35 మద్యం బాటిల్లను స్వాధీనం చేసు కున్నట్లు కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే.చంద్రహాస్ తెలిపారు.బంగారుపేటకు చెందిన నీలి షికారి అనరీ వద్ద 20 లీటర్లు మరియు నీలి షికారి లక్ష్మీ వద్ద 30 లీటర్ల నాటు సారాను స్వాదీనము చేసుకొని,సదరు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్టు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే.చంద్రహాస్ తెలిపారు
కల్లూరు ఎస్టేట్ కి చెందిన జక్కల మునయ్య వద్ద 22 మరియు దేవర అంజినేయులు వద్ద 15 మద్యం బాటిల్లు స్వాదీనము చేసుకొని, ఇద్దరు మగ వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్టు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే.చంద్రహాస్ తెలిపారు.ఈ దాడులలో కర్నూల్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ కె.నవీన్ బాబు,రెహన బేగం మరియు కానిస్టేబుల్ సిబ్బంది మధు,సూర్యనారాయణ, రామలింగయ్య ,ఈరన్న,సువర్ణమ్మ పాల్గొన్నారు
Admin
Voice Of India News