Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలో నమోదైన 2 ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులలో 5 మందికి 9 సంవత్సరాల 2 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ కర్నూలు ఎస్సీ ఎస్టీ విభాగం కోర్టు జడ్జి వాసు తీర్పు వెలువరించారు.కర్నూలు జిల్లా,కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీ కి చెందిన 5 మంది కి జైలుశిక్ష విధించారు. 1.నేసే శ్రీనివాసులు (50),2.నేసే రాజు (24) 3.నేసే సరోజ (45) భర్త శ్రీనివాసులు 4.నాగజ్యోతి (26)5.నేసే వెంకటేశు అలియాస్ వెంకటేష్ వీరందరూ ఒక కుటుంబంనికి చెందిన వారు కాలనిలో వీరి ఇంటి పక్కన గోవిందమ్మ కుటుంబం నివసిస్తూ ఉంటారు.గోవిందమ్మ ఇంటి నుండి వచ్చే మురికి నీళ్ళు వీళ్ళ ఇంటి స్ధలంలోకి వస్తున్నాయని 2018 మే17 తేదిన నేసే శ్రీనివాసులు కుటుంబ సభ్యులు గోవిందమ్మతో గొడవలు పడి కులం పేరుతో దుసించిన్నారు.మరొకసారి 2018 జూన్ 3 వ తేదిన గోవిందమ్మ ఇంటి నుండి నేసే శ్రీనివాసులు ఇంటి స్ధలంలో కి మరల మురికి నీళ్ళు వస్తున్నాయని గోవిందమ్మను దాడి చేసి గాయపర్చినారు.ఈ విషయం పై కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ లో 2 కేసులు నమోదు అయినవి. Cr.No.245/2018 U/s 323, 324, 354, 506 r/w 34 IPC & sec 3(1)(r)(s) of SC/ST Act. Cr.No.220/2018 U/s 324 r/w 34 IPC & sec 3(1)(r)(s), 3(2)(va) of SC/ST Act అప్పటి ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ లు మురళీధర్ రెడ్డి,వినోద్ కుమార్ లు సమగ్రంగా దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.అన్ని కోణాల్లో ఈ కేసును విచారించిన పిదప నేరం ఋజువు కావడం తో ఎస్సీ ఎస్టీ విభాగం కోర్టు జడ్జి వాసు 5 మంది నిందితులకి మొత్తం 9 ఏళ్ళ 2 నెలల పాటు జైలు శిక్ష విధించారు. నేసే శ్రీనివాసులు కు రూ. 25 వేలు జరిమానా,మిగతా నలుగురికి నేసే రాజు, నేసే సరోజ.నాగజ్యోతి.నేసే వెంకటేశులు ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధించారు.కేసు నమోదు చేసి,పక్కాగా దరాప్తు చేసిన డీఎస్పీలను.పోలీసు అధికారులను, సాక్షులను కోర్టు యందు హాజరు పరిచిన కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ప్రత్యేకంగా అభినందించారు.
Admin
Voice Of India News