Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : పిల్లల మానసిక ఉల్లాసానికి ఈ నెల 9,10న జరిగే కర్నూ లు బాలోత్సవం దోహదపడుతుందని,ఈ పిల్లల పండుగ ను విజయవంతం చేయాలని కర్నూలు బాలోత్సవం గౌర వాధ్యక్షులు జి పుల్లయ్య,అధ్యక్షులు జంద్యాల రఘుబా బు,ప్రధాన కార్యదర్శి డి.ధనుంజయలు కోరారు.ఈమేర కు మంగళవారం నగరం లోని ఏ.క్యాంప్,మాంటిసోరి పాఠశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా కర్నూలు బాలోత్సవం లోగో ఆవిష్కరణ చేశారు.అనంతరం కర్నూలు బాలోత్సవం గౌరవాధ్యక్షు లు జి.పుల్లయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం లేకపోవడం వల్ల పిల్లలు ఫోన్లు,ట్యాబ్లకు బానిసలవు తున్నారన్నారు.మార్కులు,ర్యాంకులు,సీట్లు అనే పద్ధతిలో విద్యాసంస్థలు ఉంటున్నాయన్నారు.పిల్ల లను కంట్రోల్ చేసుకోవడం టీచర్లకు పెద్ద సమస్య అయి పోయిందని,పిల్లలపై తల్లితండ్రులు జాగ్రత్త వహించకపో తే వారి మానసిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకంగా మారు తుందని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో బాలోత్సవం లాంటి కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనేలా చేయడం మంచి పరిణామమన్నారు.బాలోత్సవం ద్వారా కొంత మందైనా సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉండటానికి అవకాశం ఏర్ప డుతుందన్నారు.5వ బాలోత్సవం మంచి వాతావరణం లో దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు.బాలోత్సవం అధ్యక్షులు జంద్యాల రఘుబాబు,ప్రధాన కార్యదర్శి డి.ధనుంజయ మాట్లాడుతూ మానసిక ఒత్తిడి నుంచి విద్యార్థులు బయటపడేందుకు బాలోత్సవం దోహదం చే స్తుందన్నారు.అకడమిక్,కల్చరల్ కార్యక్రమాలతో పండు గ వాతావరణంలో బాలోత్సవం నిర్వహించనున్నామని, రెండువేల మందికిపైగా పిల్లలతో ఈ సంబరం జరపను న్నామని తెలిపారు.కంటి వైద్య నిపుణులు డాక్టర్ కె.స్వా తి మాట్లాడుతూ గత బాలోత్సవం స్ఫూర్తితో పిల్లలంద రూ ఈ బాలోత్సవంలో పాల్గొనాలని కోరారు.ప్రతి ఏడాది పండుగలా బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.ప్రవేట్ విద్యా సంస్థ ల జిల్లా గౌరవాధ్యక్షులు పి.బి.వి.సుబ్బయ్య మాట్లాడు తూ పిల్లలందరూ పాల్గొనేలాచేసి సృజనాత్మకతను వెలికి తీసేలా ఈ బాలోత్సవం నిర్వహిస్తున్నారని,పిల్లలను కేవ లం చదువుకే పరిమితం చేయకుండా ఇలాంటి కార్యక్ర మాల్లో పాల్గొనేలా చేయాలని కోరారు.క్లస్టర్ యూనివర్సి టీ డీన్ డాక్టర్ అక్తర్ భాను మాట్లాడుతూ పిల్లల్లోని నైపు ణ్యాలను వెలికి తీసేందుకు మానసిక ఉల్లాసం కోసం ఈ కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు.ముందుగా కర్నూలు బాలోత్సవం పూర్వ ప్రధాన కార్యదర్శి జె.ఎన్.శేషయ్యకు నివాళిగా మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో ప్రయివే టు విద్యా సంస్థల జిల్లా అధ్యక్షులు వాసుదేవయ్య,మాం టిస్సోరి విద్యా సంస్థల సిఈఓ విల్సస్,ఇండస్ పాఠశాల ప్రిన్సిపల్ మీనాక్షి విల్సస్,బాలోత్సవం ఉపాధ్యక్షులు సు ధీర్ రాజు,రమాదేవి,కోశాధికారి జె.రంగస్వామి,ప్రచార కార్యదర్శులు ఈ.ఎల్లాగౌడ్,డి.చంద్రమోహన్,కమిటీ స భ్యులు,తదితరులు పాల్గొన్నారు
Admin
Voice Of India News