Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు నగరం,నాల్గవ పట్టణ పోలీస్ స్టే షన్,శరీన్ నగ ర్ కు చెందిన ఇద్దరు వ్యక్తు లను జిల్లా కలెక్టర్ ఎ.సిరి జిల్లా బహిష్క రణ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురు వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కర్నూలు నాలుగో ప ట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో షరీన్ నగర్ లో నివాసముం డే కిరాయి హంతకుడు షీట్ నం.1 వడ్డే రామాంజనేయు లు @ వడ్డే అంజి,సస్పెక్ట్ షీటర్ 216 అయిన పఠాన్ ఇమ్రా న్ ఖాన్ అనే ఈ ఇద్దరు చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు అలవాటు పడిన వీరి ఇద్దరిపై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్ట ర్ ఎ.సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేష న్ నందు వడ్డే రామాంజినేయులు @ వడ్డే అంజి మీద జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో 17కుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి .అందులో హత్యలు,దోపిడీలు, ఎస్సీ,ఎస్టీ వర్గాల మీద దాడులు, జులుం కేసులు,హత్యాయత్నం కేసులు ఇలా పలురకాల కేసులు నమోదయి ఉన్నా యి.అదే విధంగా మరొక వ్యక్తి పఠాన్ ఇమ్రాన్ ఖాన్ మీద కూడా సుమారు 19 క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు.పలుమార్లు వీరిపై తెలిపిన కేసుల్లో రిమాండ్ కు వెళ్లినా కూడావారిలో ఎటు వంటి మార్పు రాకపోవడం,అదేవిధంగా 2022వ సంవత్సరంలో వీరిద్దరూ కూడా పీడీ act నిర్భంద ఉత్త ర్వుల కింద కడప సెంట్రల్ జైల్లో ఖైదు చేయబడినప్పటికీ వీరి ప్రవర్తనలో మార్పురాకపోగా,తదు పరి కూడా రకర కాల కేసులలో పాల్గొంటున్నారని కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ యొక్క ప్రతిపాదనల మేరకు వారి ఇద్దరి యొక్క క్రిమినల్ రికార్డులను నిశి తంగా పరిశీలించిన మీదట జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నిన్నటి రోజున ఇద్దరి మీద జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటినుండి ఎవరైనా రౌడీయిజంతో అరాచక శక్తులుగా మారి,ప్రజలను భయ భ్రాంతులకు గు రిచేస్తూ,శాంతిభద్రతలకు విఘాతం కలగజేసే విధంగా ప్ర వర్తిస్తే అటువంటి వారిపై జిల్లా బహిష్కరణతో పాటుగా పీడి యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించడం జరుగు తుందని,ప్రశాం తంగా,మంచిగా,బుద్ధిగా జీవించాలని జిల్లా ఎస్పీ కోరారు.ఇటువంటి చెడు నడత కలిగిన వారిపై ఇంకా కొంత మంది పై కూడా జిల్లా బహిష్కరణ గురించి పరిశీలనలో ఉన్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు
Admin
Voice Of India News