Saturday, 31 January 2026 07:49:20 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF

రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీడియదే సీనియర్ హైకోర్టు అడ్వకేట్ వై.జయరాజు

Date : 23 March 2025 10:01 PM Views : 134

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : మీడియా స్వేచ్ఛను కాపాడడంలో భారతదేశం ప్రపంచంలో అధమస్థానంలో ఉందని ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు అన్నారు.ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు ప్రాంగణంలోని,ఎంపీపీ సమావేశ మందిరంలో యునైటెడ్ జర్నలిస్టు ఫోరం (యుజెఎఫ్) జిల్లావిస్తృత సమావేశం అత్యంత ఉత్సాహ వాతావరణంలో సాగింది. ఈ సందర్బంగా జర్నలిస్టులు కిసాన్ ఘాట్ నుంచి రాజవిహార్ సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు.అనంతరం ఎంపీపీ హాలులో జర్నలిస్ట్ లకు రక్తం గ్రూప్ పరీక్షలు,హెచ్ పరీక్షలు జరిపారు. తదనంతరం జిల్లా విస్తృత సమావేశం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కార్యదర్శి జి.మునిస్వామి అధ్యక్షతన నిర్వహించారు.సమావేశానికి హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు, జెవివి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బీ.డీ.సుధీర్ రాజు,డాక్టర్ బడేసాహెబ్, సీనియర్ జర్నలిస్టు చంద్రయ్య,అడ్వకేట్ లక్ష్మీనారాయణ యాదవ్,యుజెఎఫ్ వ్యవస్థాపక అధ్యక్ష,కార్యదర్శులు సత్యనారాయణ,చిన్న రామాంజ నేయులు హాజరై మాట్లాడారు.దేశంలో ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారిదిగా మీడియా పనిచేస్తుందన్నారు.అలాంటి మీడియాను ముందుకు నడిపించే ఇంధనంగా జర్నలిస్టులుపనిచేస్తున్నారన్నారు.రోజురోజుకు మీడియా శక్తి విస్తరిస్తోందన్నారు.కాగా మీడియా పట్ల జరుగుతున్న దాడులు ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు. ప్రపంచంలో మీడియా స్వేచ్ఛ అత్యంత అదమస్థానంలో ఉన్న దేశంగా భారత్ నమోదయిందన్నారు.అందులో భారత్ 161వ స్థానంలో నిలిచిందని అన్నారు. దేశంలో కార్పొరేట్ ల చేతుల్లో మీడియాకు ఉందన్నారు.దేశంలో సాగుతున్న మూడ విశ్వాసాలను ప్రశ్నించే మీడియా సంస్థలపై,మతతత్వ శక్తులు దాడులకు తెగబడుతున్నాయి అన్నారు.రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ సమాజం లౌకిక భావనలను కాపాడాల్సిన పాలకులు వాటిని నిర్వీర్యం చేసే దిశగా కృషి చేస్తున్నాయని చెప్పారు. తెరచాటున మతతత్వయజండాను అమలు చేసే కుట్రలను బయటికి జర్నలిస్టులు తీయాలని,దాని ప్రమాదానాలను ఎండగట్టాలన్నారు. సమాజ సంపదపై అందరికీ సమానహక్కు ఉన్నప్పటికీ అది కేవలం 10శాతం మందికే దక్కిందని,90శాతం మందికి దూరమైందన్నారు.90శాతం మంది ప్రజల కళ్ళు,చెవులుగా మీడియా నిలవాలన్నారు.ప్రతి వార్తా ప్రజల కోసం సామాజిక బాధ్యతో ఉండాలన్నారు. సమాజాన్ని మార్చే శక్తులు జర్నలిస్టులు అన్నారు.అలాంటి ఆశయాలతో ముందుకు వచ్చిన యునైటెడ్ జర్నలిస్టు ఫోరం కృషి అభినందనీయం అని వారు తెలిపారు.అనంతరం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీలను ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో యుజెఎఫ్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు విజయ్ కుమార్,నాయకులు ఆసిఫ్, కిషోర్,గంగాధర్,నగర అధ్యక్షులు నాగేంద్రుడు,కోశాధికారి రాజశేఖర్, కల్లూరు మండల అధ్యక్ష,కార్యదర్శులు లోకేష్,మధుసూదన్,యూజెఎఫ్ నాయకులు కరణ్,వజ్రరాజు,రాజశేఖర్, ఓర్వకల్లు మండల కమిటీ నాయకులు చిన్న స్వాములు,మద్దిలేటి,జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల జర్నలిస్ట్ లు,శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ప్రింట్ విభాగం నూతన జిల్లా కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు : యూసఫ్ ఖాన్, అధ్యక్షులు : విద్యాసాగర్, కార్యదర్శి : చంద్రమోహన్, కోశాధికారి : సంధ్య ప్రసాద్, ఉపాధ్యక్షులు : పరమేష్, సహాయ కార్యదర్షులు : ఎం.సీ.వెంకటేష్,లక్ష్మణ్, ఈసీ మెంబర్స్ : వరప్రసాద్,వడ్డేమాన్ విజయ్ కుమార్,వారణాసి ప్రసాద్. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ఎలక్ట్రానిక్ విభాగం నూతన జిల్లా కమిటీ అధ్యక్షులు : విజయ్ కుమార్, కార్యదర్శి : మెట్రో మధు, ఉపాధ్యక్షులు : జి.వి.ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు : రవిశంకర్ గౌడ్

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :