Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : వాయిస్ అఫ్ ఇండియా కర్నూలు టౌన్ : కర్నూలు నగరంలోని మద్యపాన,మత్తుపదా ర్థాల వినియోగాన్ని నిరోధించేందుకు శుక్రవా రం ధర్మపేటలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా ప్రొహి బిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాల జోలికి పోకుండా కుటుంబ పరిరక్షణ కోసం పాటుపడల ని వ్యసనాల వల్ల వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవనం సమాజంపై పడే దుష్ఫలితాలను వివరించారు.వ్యసనల నుండి విముక్తి పొందేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయక కార్యక్రమాల వివరాలు ప్రజలకు తెలియజేశారు.ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ మాట్లాడు తూ సుమారు 100 మంది ప్రజలు ఉత్సాహంగా హాజరై వ్యసన విముక్తిపై విలువైన సమాచారం తెలుసుకున్నార ని తెలిపారు.మత్తుపదా ర్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్య సమ స్యలతో పాటు కుటుంబ సంబంధాలు,ఆర్థి క పరిస్థితి ఎలా దెబ్బతింటుందో వివరించారు.ఈకార్యక్ర మంలో ఎన్జీవో ప్రెసిడెంట్ మరియు కేర్ కమిటీ సభ్యులు రాజేంద్రప్రసాద్,ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ (ఈఎస్టీఎఫ్) రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Admin
Voice Of India News