Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : రాష్ట్రంలోని ఆర్టీఈ విద్యార్థుల సమస్యలు తక్షణం పరి ష్కరించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షు డు పగడాల ఆనంద్ బాబు,రాయలసీమ విద్యార్థి సం ఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.నగరంలోని బిర్లా కాంపౌండ్ సాయి వసంత్ కాం ప్లెక్స్‌లో జెఎసి కార్యాలయంలో బుధవారం నిర్వహించి న మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.విద్యా హక్కు చట్టం – 2009 అమలుకు రాష్ట్రవ్యాప్తంగా “పోరుబాట” కార్యక్రమం చేపడతామని తెలిపారు.గత మూడు సంవత్సరాల ఫీజు బకాయిలు చెల్లించడంతో పాటు,ప్రభుత్వం విద్యాసంస్థలకు ఇస్తున్న ఫీజును 30 వే లకి పెంచాలని,ఆర్టీఈ ద్వారా చదివే విద్యార్థులకు కూ డా తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని,మార్కులు –హాజరు పర్యవేక్షణను మండల విద్యా శాఖ అధికారు లు చేపట్టాలని,ఫేజ్–1లో సీట్లు పొంది రిజెక్ట్ అయిన వా రికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అదే విధంగా విద్యా హక్కు చట్టం ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థు లను కొన్ని పాఠశాలలు ప్రత్యేకంగా కూర్చోబెట్టి విద్యా బోధన చేస్తున్నారని ఈ విషయంపై అధికారులు తనిఖీ చేసి పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు. Rte విద్యార్థుల తల్లిదండ్రుల నుం చి వసూలు చేసిన ఫీజులు తిరిగి ఇవ్వాలని పాఠశాల మేనేజ్మెంట్లను కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఈ పేరెం ట్స్ సమితి నాయకులు ఖాదర్ ఖాన్,అశోక్,నగేష్,విశ్వ నాథ్ యాదవ్,ఉసేన్ పీరా,రవి,మహేంద్ర,షకీల్,విద్యార్థి సంఘాల నాయకులు గణేష్,జయకృష్ణ,ఆనంద్,ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు కోనేటి వెంకటేశ్వర్లు, చైర్మన్ - రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి.సెల్: 8500005992
Admin
Voice Of India News