Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చే యాలని,వైద్య రంగంలో పరిశోధనలతో సరికొత్త వైద్య పద్ధతులను కనిపెట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా నీట్ పరీక్షలో మెడిసిన్ సీటును సాధించిన విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో చిన్న టేకూరులోని డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల కళాశాల ఐఐటీ మెడికల్ అకాడమీ ద్వారా శిక్షణ పొంది నీట్ లో ప్ర తిభ కనబరిచి మెడికల్ సీట్లు సాధించిన వి ద్యార్థులను కలెక్టర్ అభినందించారు.ఈ విద్యార్థులందర్నీ కలెక్టర్ శాలువాతో సత్కరించి,అవార్డ్ అందచేశారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు లో వైద్యులుగా సమాజానికి సేవ చేయాలని సూచించారు.లాభాపేక్ష లే కుండా పేదలకు సేవలందించాలని సూచించారు.వైద్య రంగంలో పరిశోధనల వైపు దృష్టి సారించి,మరెన్నో వైద్య పద్ధతులను కని పెట్టాలని సూచించారు.విద్యార్థుల కృషి, పట్టుదల మరియు అకాడమీ అందించిన మార్గదర్శకత ఫలితంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.భవిష్యత్తులో మరింత మంది వి ద్యార్థులు ఉన్నత విద్యలో సీట్లు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించా రు
విద్యార్థులతో పాటు కలెక్టర్ అధ్యాపకులను అభినందిం చారు కల్లూరు మండలం చిన్నటేకూరులోని డా.బి.ఆర్.అంబే ద్కర్ గురుకుల కళాశాల ఐఐటీ మెడికల్ అకాడమీ లో అడ్మిషన్స్,సౌకర్యాల గురించి డిసివో,అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు.ఈ ఏడాది అకాడమీ నుండి 25 మంది విద్యార్థు లు ఐఐఐటీ,నీట్ 8 మంది విద్యార్థులు ఎంబిబిఎస్ కి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారని డిసిఒ కలెక్టర్ కు వివరించారు.ఈ ఏడాది ఎంబిబిఎస్ సీట్లు సా ధించిన సురేంద్ర.సాయి గణేష్.వికాస్ కుమార్ ప్రణయ్ బాబు.సంతోష్ కుమార్,సాయి కృష్ణ,నితీష్ నాయక్ ను కలెక్టర్ అభినందించారు.కార్యక్రమంలో గురుకుల కళాశా లల జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి,అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Admin
Voice Of India News